కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన ఉత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు భక్తి నామస్మరణతో, కాషాయ జెండాల సందడితో వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
కాలనీ వాసులు కాషాయ జెండాలు పట్టుకుని వీధి వీధి తిరుగుతూ శ్రీ నామ జపం చేస్తూ భక్తి పరవశంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
సమ్మేళన సమితి సభ్యులు మాట్లాడుతూ, శనివారం వాసవి స్కూల్లో నిర్వహించనున్న ప్రధాన హిందూ సమ్మేళన కార్యక్రమానికి 15, 16, 17 వార్డుల ప్రజలతో పాటు హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.












