ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అండగా నిలిచి, చిన్నారుల భవిష్యత్తుకు ఆర్థిక సహాయం అందించారు.
గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని చాకలి దుర్గేష్ అకాల మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్ రెడ్డి గురువారం మృతుడి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు.
దుర్గేష్ కుమార్తెలైన ప్రవళిక, లిఖితల పేరిట ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున పోస్టాఫీసులో డిపాజిట్ చేయిస్తానని గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. తక్షణ అవసరాల కోసం నగదు సాయం అందజేశారు.
భవిష్యత్తులో కూడా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ ట్రస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.












