శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3000 మందికి ఫ్రూట్ బౌల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అమ్మవారి జయంతి కార్యక్రమంలో పాల్గొని, ఐవిఎఫ్ సభ్యులను అభినందించారు.
ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి, యువజన విభాగం అధ్యక్షులు ఎర్రం ఈశ్వర్ మాట్లాడుతూ, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మార్గదర్శకాలతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఐవిఎఫ్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణలో ఇదే మొట్టమొదటిసారిగా 3000 మందికి ఫ్రూట్ బౌల్స్ పంపిణీ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. అమ్మవారి అహింసా, సేవా మార్గాన్ని అనుసరించాలని, ఐక్యతతో ముందుకు సాగితే వైశ్యులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, నంగునూరి కాశీనాథం, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కౌడ ప్రవీణ్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.












