సీనియర్ జర్నలిస్టు అంజిబాబు నాగుల జన్మదిన వేడుకలు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
జర్నలిజంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న అంజిబాబు నాగుల పుట్టినరోజు సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఆయన మిత్రులు, సహవిద్యార్థులు కలిసి కేకు కోసి, వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా అంజిబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
తదనంతరం, అంజిబాబు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, జానపద విభాగం డీన్ విజయ్ పాల్, జర్నలిజం అధ్యాపకులు డా.షేక్ హసీనా, షేక్ షమీర్, గోపాల్ వంటి ప్రముఖులను కలిసి ఆశీర్వాదాలు అందుకున్నారు.
అంజిబాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. న్యాయవాది కొండూరి కోటిబాబు, లవన్ కుమార్, వై.నదియా, తెలుగుప్రభ డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ ప్రశాంత్, పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు, ఏరువాక టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు అనిల్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయన స్నేహశీలత, ఆత్మీయతను కొనియాడారు.
తనపై చూపిన ప్రేమ, అభిమానాలకు అంజిబాబు నాగుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ తనతో ఉండాలని కోరుకున్నారు.











