కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట కాలనీలో అనారోగ్యంతో మరణించిన గోమాతకు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కాలనీ వాసుల సమాచారం మేరకు హిందూ వాహిని సభ్యులు వెంటనే స్పందించి, గోమాత పట్ల భక్తి శ్రద్ధలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గో ప్రేమికుడు పత్తిపాక తరుణ్, హిందూ వాహిని పట్టణ అధ్యక్షుడు మదన్, పలువురు కార్యకర్తలు పాల్గొని, గోమాతకు చివరి వీడ్కోలు పలికారు.
కార్యక్రమానికి సహకరించిన రామోజీ, నాగరాజు అన్నగారికి, అలాగే కాలనీ వాసులకు హిందూ వాహిని సభ్యులు తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
గో సేవనే దేశ సేవ అనే స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.












