కామారెడ్డిలో సబ్ ఇన్స్పెక్టర్గా సేవలందించిన ఎం. శ్రీరామ్ పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహచర అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.
విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసిన శ్రీరామ్ సేవలు శాఖకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజలతో సౌహార్దంగా మెలిగి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకువచ్చారని అభినందించారు.
అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
ఆయన శేష జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు.
పదవీ విరమణ చేసిన శ్రీరామ్‌కు జిల్లా పోలీస్ శాఖ శుభాకాంక్షలు తెలిపింది.


