అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళా మోర్చా ఆధ్వర్యంలో సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఆరోగ్య, న్యాయ, యోగా రంగాలలో సేవలందించిన ముగ్గురు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు.
బిజెపి రాష్ట్ర మహిళా మోర్చ నిర్దేశాల మేరకు, ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి శ్రీమతి పమ్మి అనిత సమక్షంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జోయా హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి నైమా సుల్తానా, న్యాయవాద వృత్తిలో సేవా దృక్పథంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న పోలిశెట్టి పద్మావతి, మరియు గత 20 ఏళ్లుగా ఉచితంగా యోగాభ్యాసం నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలు రావురి పుష్ప లను సన్మానించారు.
డాక్టర్ నైమా సుల్తానా మహిళా ఆరోగ్య సంరక్షణలో, పోలిశెట్టి పద్మావతి న్యాయ సలహాలు, సహకారంలో, రావురి పుష్ప యోగా శిక్షణ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య ప్రచారంలో అందిస్తున్న విలువైన సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రశంసించారు. వీరి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మహిళలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకురాలు గోలి ఫణి కుమారి, స్వర్ణ సుందర, విజయతో పాటు పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల సాధికారత, వారి సేవలను గుర్తించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

