జీహెచ్ఎంసీ నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్రూమ్ సముదాయానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్యకు పరిష్కారం లభించింది. సుమారు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును బుధవారం ఘనంగా ప్రారంభించారు.
నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, చర్లపల్లి కాంటెస్టెంట్ కార్పొరేటర్ గడ్డం యాదగిరి గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు చాలా కాలంగా రహదారి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేశామని వారు తెలిపారు.
ఈ నూతన బీటీ రోడ్డు నిర్మాణం వల్ల స్థానికులకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుందని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. నాణ్యమైన నిర్మాణ పద్ధతులను పాటించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకట్‌తో పాటు డబుల్ బెడ్రూమ్ కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు అందుబాటులోకి రావడంతో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.










