పందుల మధ్య పోటీ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మ ల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

విభాగాలలో పందుల పోటీలు విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

కత్తులు కట్టని, ప్రాణహాని లేని ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో మాకు మద్దతు కావాలని నిర్వాహకులు సింగం సుబ్బారావు తెలియజేశారు.

ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు, పందుల పందేలలో ఏ విధమైన ప్రాణ నష్టం ఉండదని, వినోదం కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఏకలవ్య అసోసియేషన్ సభ్యులు, జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పోటీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పందుల మధ్య పోటీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామం, కోనసీమ జిల్లా వెలస గ్రామం మధ్య పోటీలు నిర్వహించగా బుచ్చి గ్రామం ఉనికి చెందిన పంది విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తిరుపతిపాడు, కొమ్ముగూడెం గ్రామాల పందుల మధ్య పోటీ నిర్వహించగా తిరుపతి పడుకు చెందిన పంది విజేతగా రెండవ స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట, నిడదవోలు గ్రామాలకు చెందిన పందుల మధ్య పోటీ నిర్వహించడం మండపేట పంది మూడవ విద్యార్థిగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామాల మధ్య ఉన్న పందుల మధ్య పోటీ నిర్వహించగా తాడేపల్లిగూడెం పంది పోటీలో తాడేపల్లిగూడెం కు చెందిన పంది విజేతగా నిలిచింది.

Join WhatsApp

Join Now