తాళ్లరాంపూర్ లోని విడిసి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ కి ఫిర్యాదు*

*తాళ్లరాంపూర్ లోని విడిసి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ కి ఫిర్యాదు*

 

జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళి గౌడ్.

 

*విడిసి ఆగడాలను ప్రశ్నించడానికి వెళ్తే అరెస్టు అన్యాయం*

 

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 19

 

విడిసి ఆగడాలను ప్రశ్నించడానికి వెళ్తే అరెస్టుచేయడం అన్యాయంమని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళి గౌడ్ అన్నారు . నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో వి డి సి సభ్యులు గౌడ కులస్తులపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నారన్నారు. గౌడ కులస్తులను విడిసి సభ్యులు రూములో బంధించడం ఎంతవరకు సభబని ప్రశ్నించారు. గౌడ కులస్తులను వేధించిన వీడీసీ సభ్యుల ఇండ్ల ముట్టడికి వెళ్లిన తమను అరెస్టు చేయడం అక్రమమన్నారు. అనంతరం తాళ్ల రాంపూర్ గ్రామ విడిసి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు ఉత్తనూరు రామా గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కర్రోల శేఖర్ గౌడ్, మాచారెడ్డి మండల అధ్యక్షులు బొంబోతుల సురేష్ గౌడ్, గౌరారం ప్రకాష్ గౌడ్ లతోపాటు భారీ సంఖ్యలో గౌడ సోదరులు తరలి వెళ్లారు.

Join WhatsApp

Join Now