అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు
Headlines :
  1. అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు: ‘ఆర్మీ’ పేరుపై అభ్యంతరం
  2. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టడం పై అల్లు అర్జున్ పై ఫిర్యాదు
  3. గ్రీన్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షుడు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరారు
  4. అల్లు అర్జున్ “అర్జున్ ఆర్మీ” పేరును ఉపయోగించడం పై వివాదం
  5. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ పై ఫిర్యాదు: ఆర్మీ పేరుతో వ్యతిరేకత

సినీహీరో అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 

అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని.. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు. 

ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అల్లు అర్జున్ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా పలు వేది కలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు.. అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now