*కౌశిక్ రెడ్డి పై హుజురాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు*
*రాజకీయాల్లో హుందాగా ఉండాలి*
*జగిత్యాల ఎమ్మెల్యే పై దాడి హేయనీయమైన చర్య*
*దాడిని ఖండించిన హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు*
*హుజురాబాద్ జనవరి 13 ప్రశ్న ఆయుధం*
సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు హేయమైన చర్య అని హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు.ఈ మేరకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు,ఎమ్మెల్యేల పట్ల కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు,వాడిన పదజాలం సరిగా లేదని ప్రజా సమస్యల పట్ల నిర్వహిస్తున్న సభలో గందరగోళం సృష్టించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందకుండా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుపతి,మండల అధ్యక్షుడు కిరణ్,హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్,మహిళా అధ్యక్షురాలు పుష్పలత మండల అధ్యక్షురాలు లావణ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి,డైరెక్టర్ కిరణ్ రెడ్డి,సదానందం,తిరుపతి,బాబు,నరేష్ మైనారిటీ సెల్ టౌన్ అధ్యక్షుడు అఫ్సర్,సీనియర్ నాయకులు బాబు,నరేష్,కిరణ్ రెడ్డి,పోషయ్య, నరసింహ రెడ్డి,చాంద్ పాషా, ఖాలిద్, ఉప్పు శ్రీను, అలీం మల్లిక,అనిల్,వినోద్, సాంబయ్య,ఐలయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.