Headlines :
-
ప్రస్తావన: వాత్సల్య పిల్లల హాస్పిటల్ పై ఆరోపణలు
-
గట్టు సాయిరాం చేసిన ఫిర్యాదు: ముఖ్యాంశాలు
-
జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం పై ఆరోపణ
-
చట్టపరమైన చర్యలకు అవసరమైన పునరాలోచన
-
కలెక్టర్ స్పందన: వెంటనే చర్యలు తీసుకోవాలి
-
ముగింపు: పేద ప్రజల ఆరోగ్య భద్రత పై ప్రతిపాదనలు
*వాత్సల్య పిల్లల హాస్పిటల్ పై ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు*
*సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం*
*జమ్మికుంట నవంబర్ 4 ప్రశ్న ఆయుధం::-*
లాభార్జనే ధ్యేయంగా పేద ప్రజల రక్తాన్ని జలగల పిలుస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వాత్సల్య పిల్లల హాస్పిటల్ వైద్యుడి పై సోమవారం రోజున జరిగే ప్రజావాణి లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కి సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం ఫిర్యాదు చేశారు జమ్మికుంట పట్టణంలో వాత్సల్య పిల్లల హాస్పిటల్ లో వారం రోజుల కింద జరిగిన సంఘటనను ఇప్పటివరకు కూడా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోకుండా ఉన్నారని దీనిని బట్టి చూస్తే వైద్యాధికారులు వాత్సల్య పిల్లల హాస్పిటల్ కు కొమ్ము కాస్తున్నారా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గట్టు సాయిరాం పేర్కొన్నారు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి నాణ్యత లేని వైద్యాన్ని అందిస్తూ లాభార్జన ధ్యేయంగా అధిక సొమ్ములను తీసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ నన్ను అడిగే వారు లేరని వ్యవహరిస్తున్న వాత్సల్య పిల్లల హాస్పిటల్ పై తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఈ విషయంపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తక్షణమే జమ్మికుంట లోని వాత్సల్య పిల్లల హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి కి తెలిపారు