Site icon PRASHNA AYUDHAM

యతీ నరసింహనంద్ పై ఖమ్మం ఏసీపీకి ఫిర్యాదు..

యతీ నరసింహనంద్ పై ఖమ్మం ఏసీపీకి ఫిర్యాదు

ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ దస్నా దేవి మందిర ప్రాంతంలో, హిందీ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యతీ నరసింహనంద్ సరస్వతి ప్రవక్త మొహమ్మద్ (స)పై అనుచిత వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భారతదేశంతో పాటు అనేక అరబ్ దేశాల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ వీడియోలపై వివిధ చోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.ఈ ఘటనపై ఖమ్మం జిల్లా సమ్మాన్ ఎన్జీవో సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి & న్యాయ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అడ్వకేట్ సాదిక్ షేక్ ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమణ మూర్తి గారికి ఫిర్యాదు చేశారు. యతీ నరసింహనంద్ పై తగిన చర్యలు తీసుకోవాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పని అన్నారు.

ప్రవక్త మొహమ్మద్ (స) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరo.

ప్రవక్త మొహమ్మద్ (స) కేవలం ముస్లిం సమాజానికే కాదు, మొత్తం మానవాళికి మానవతా విలువలను నేర్పించిన మహనీయుడు. ఆయనపై విషపూరిత వ్యాఖ్యలు చేయడం ముస్లిం సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది,’’ అని సాదిక్ షేక్ అన్నారు. ‘‘నరసింహనంద్ వంటి వ్యక్తులు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం పోలీసు మరియు న్యాయ వ్యవస్థను అపహస్యం చేయడం అని భావిస్తున్నాం,’’ అని పేర్కొన్నారు.

భారతదేశ సామరస్యానికి ప్రమాదం..

‘‘ఇటువంటి వ్యక్తుల వల్ల భారతదేశ మత సామరస్యానికి మరియు లౌకికతకు తీవ్రమైన ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఇటువంటి ప్రసంగాల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉంటే, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం,’’ అని అడ్వకేట్ సాదిక్ షేక్ అన్నారు.ఫిర్యాదులో ప్రముఖులు పాల్గొనడంఈ ఫిర్యాదులో సీనియర్ న్యాయవాది అక్బర్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సిటీ మైనారిటీ అధ్యక్షుడు అబ్బాస్ బేగ్, ఖమృద్దీన్, అబూ బకర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version