ఇండ్ల బిల్లు ఇప్పించాలంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఇండ్ల బిల్లు ఇప్పించాలంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

 

 

గత ప్రభుత్వం హయాంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కావడంతో ఇండ్లను నిర్మించుకున్నాం. ఇండ్ల నిర్మాణానికై విడుదలైన బిల్లులను గుత్తేదారు గోల్మాల్ చేసి తమకు బిల్లులు ఇప్పటివరకు సక్రమంగా అందించలేదంటూ మమ్మద్ నగర్ మండలంలోని

ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులు సోమవారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు ప్రభుత్వం విడుదల చేసిన బిల్లులను తమకు చెల్లించకుండా గుత్తేదారు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం కొరకు అప్పు చేసాం.. అప్పు కాస్త పెరిగిపోతున్నాయన్నారు. తమకు బిల్లు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. విషయం తెలుసుకొని మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి లబ్ధిదారులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా విషయం తెలుసుకొని బాధితులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now