Site icon PRASHNA AYUDHAM

సర్పంచుల ఆత్మహత్యలపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

IMG 20250916 WA0045

సర్పంచుల ఆత్మహత్యలపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

బిల్లుల చెల్లింపుపై విచారణ – మరోసారి వాయిదా

రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని జేఏసీ ఆరోపణ

“దున్నపోతు పాలన” అంటూ సర్పంచుల ఘాటు విమర్శ

స్థానిక సంస్థల ఎన్నికల ముందు బిల్లులు చెల్లించాలని డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం):

తెలంగాణలో సర్పంచుల ఆత్మహత్యలు ఆగకపోవడం, పెండింగ్ బిల్లులు చెల్లింపుపై ప్రభుత్వం సైలెంట్‌గా ఉండడంపై సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈరోజు జరిగిన విచారణలో కమిషనర్, పంచాయతీరాజ్ విభాగానికి బిల్లుల చెల్లింపుపై సమాధానం కోరగా, అధికారులు మరోసారి “నెలరోజులు గడువు ఇవ్వాలి” అంటూ తప్పించుకున్నారని సర్పంచుల సంఘం మండిపడింది.

రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ – “ప్రతి నెల వాయిదా పేరుతో ప్రభుత్వం మాకు వాగ్దానాలు ఇస్తోంది కానీ ఒక రూపాయి కూడా విడుదల కావడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు గాడిద మీద వాన పడినట్టు నటిస్తూ, పంచాయతీ పాలనను పూర్తిగా అణగదొక్కేస్తోంది. ఇది ‘దున్నపోతు పాలన’ తప్ప మరొకటి కాదు” అని ఘాటుగా విరుచుకుపడ్డారు.

జేఏసీ నేతలు, . ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ప్రతిఫలం తప్పదని హెచ్చరించారు. “మా బిల్లులు చెల్లించకుండానే ఎన్నికలకు వెళితే అదే మీ పతనానికి నాంది అవుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, మెడబోయిన గణేష్, సంగారెడ్డి జిల్లా అరవింద్ రెడ్డి, వరంగల్ జిల్లా నెక్కొండ మండల ఫోరం అధ్యక్షుడు మాదాసు రవి, నిర్మల్ జిల్లా పూర్ణచందర్ గౌడ్, సముద్రాల రమేష్, వికారాబాద్ జిల్లా పి. పాండు, రంగారెడ్డి జిల్లా వెంకట్రాం రెడ్డి, తిరుపతి రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version