అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు

అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలి

జమ్మికుంట, సెప్టెంబర్ 01 ప్రశ్న ఆయుధం

అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వాహకులపై తాసిల్దార్ కార్యాలయం ప్రజావాణిలో వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన దొగ్గల ప్రకాష్ ఫిర్యాదు చేశారు జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహణపై సోమవారం జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన దొగ్గల ప్రకాష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గడ్డం శంకర్ కి ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ కు కూతవేటు దూరంలో ఉన్న మండలంలోని మడిపల్లి గ్రామ శివారులో 401, 407, 408, 409 సర్వే నంబర్లలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిలో జమ్మికుంట తాసిల్దార్ నుండి నాలా పర్మిషన్ తీసుకోకుండానే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండా ఇటుక బట్టీల నిర్వహణ చేపడుతున్న విషయంపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ కి ఫిర్యాదు చేసినట్లు ప్రకాష్ తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీకి కూతవేటు దూరంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ చేపడుతున్నప్పటికీ సంబంధిత ఇటుక బట్టిల నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని. దీనిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇటుక బట్టీల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అనుమతులు ఉండేవిధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే భూమిలో ఇటుక బట్టీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని ఆయన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆర్ఐ శంకర్ చెప్పారు సంబంధిత విషయాన్ని స్థానిక తహసిల్దార్ దృష్టికి తీసుకువెళ్లి దానిపై తగు చర్యలు తీసుకుంటామని ఆర్ఐ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment