జానీ మాస్టర్‌పై మహిళా కమిషన్‌లో ఫిర్యాదు

●40 పేజీల లేఖను సమర్పించిన బాధితురాలు

●అండగా ఉంటామన్న కమిషన్‌ చైర్‌పర్సన్‌ శారద

●జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు

సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు బాధితురాలితో కలిసి పలు మహిళా సంఘాల నాయకులు బుధవారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40పేజీలతో కూడిన లేఖను బాధితురాలు సమర్పించారు. పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌… ఫిర్యాదు ను స్వీకరించడంతోపాటు న్యాయం చేస్తామని ఆమెకు హామీ ఇచ్చింది. అనంతరం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద మీడియాతో మాట్లాడుతూ మహిళలకు అండగా మహిళా కమిషన్‌ నిలబడుతుందని, మహిళా కొరియోగ్రాఫర్‌కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now