ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదంటూ తెలంగాణ ఉద్యమకారుల ఫిర్యాదు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని తెలంగాణ ఉద్యమ కారులు కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో జైల్ కు వెళ్లక ముందు నుండి నిజామాబాద్ లో కనిపిం చడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. జైల్ నుండి వచ్చిన తరువాత సైతం నిజామా బాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకొని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమ కారులు ఫిర్యాదులో కోరారు. ప్రజలు కట్టే టాక్స్ తో వేతనం, అలవెన్స్ లు తీసుకుంటున్న కవిత ఆచూకీ తెలపాలని ఫిర్యాదు పేర్కొన్నారు.