ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ పైన చైల్డ్ వెల్ఫేర్ కమీషన్ కు పిర్యాదు..!

చిన్న పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ పైన చైల్డ్ వెల్ఫేర్ కమీషన్ కు పిర్యాదు చేసిన బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్.

ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పైన అయిన విద్యాసంస్థలో చదువుకునే చిన్న పిల్లలతో చట్ట విరుద్ధంగా తనకు సంబంధించిన ప్రైవేటు కార్యక్రమంలో ఎన్నికలలో ఓట్లు వెయ్యాలని ప్రచారం చేస్తూ వాటి‌ సంబంధించిన పోస్టర్లను పిల్లలతో ప్రదర్శన చేయించడం పూర్తిగా బాలల హక్కులకు విరుద్ధం అని చైల్డ్ వెల్ఫేర్ కమీషన్ కు పిర్యాదు ఇవ్వడం జరిగింది. కమీషన్ సభ్యులు కూడ దీని పైన పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈనెల ఒకటవ తారీకు నాడు స్థానిక ఎస్ ఆర్ అర్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయించాడమే కాక వ్యక్తిగత ఎన్నికల ప్రచారం చేయించాడం చట్ట విరుద్ధం. పిల్లల దగ్గర లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ చిన్న పిల్లలను తన స్వార్ధం కోసం ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం చట్ట విరుద్ధం కనుక అయనకు ప్రజా క్షేత్రంలో బుద్ది చెప్పేవరకు వదిలిపెట్టేది లేదని బిసి కుల ఐక్యవేదిక రాష్ట్ర గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గొట్టం మహేష్, పోన్నం అనీల్ గౌడ్, గొగ్గుల శ్రీనివాస్, మడిపల్లి వినిత్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now