అభ్యంతరకర పోస్టింగ్ పై నగర ఏసిపి కి ఫిర్యాదు..

అభ్యంతరకర పోస్టింగ్ పై నగర ఏసిపి కి ఫిర్యాదు

 చర్యలు తీసుకోండి: టియుడబ్ల్యూజి (ఐజేయు) 

అభ్యంతరకర పోస్టింగ్లు పెడుతూ మా యూనియన్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్న గుద్దేటి రమేష్ అనే వ్యక్తిపై చట్టారీత్యాతక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టియుడబ్ల్యూజె (ఐజయు) జిల్లా కమిటీ అధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏసిపి రమణమూర్తికి ఫిర్యాదు చేశారు . 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జర్నలిస్టు సంఘంగా ఉన్న టియుడబ్ల్యూజె (ఐజెయు) ప్రభుత్వ గుర్తింపు పొందిందని ఇటీవల స్వయం ప్రకటిత ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఉన్న గుద్దేటి రమేష్ మా యూనియన్ పైన, మా యూనియన్ నేతలపైనా ,స్థంభాద్రి హౌజింగ్ సొసైటీ బాధ్యులపైనా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలను దూషించడం మా కర్తవ్యాలను ప్రశ్నించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని కనకు సంబంధం లేని అనవసర విషయాలపై జోక్యం చేసుకుంటూ తన పోస్టింగ్లో బెదిదింపులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బడితెపూల చేస్తాం దిష్టిబొమ్మను తగలబెడతాం, చావుడప్పును మ్రోగిస్తామంటూ హెచ్చరించడంతో పాటు మూర్ఖులు, దుష్టులు అంటూ వ్యక్తిగత నిందారోపణలకు పాల్పడ్డారని తిలిపారు. సహనం పాటించే కొద్ది మరింతగా రెచ్చిపోయి మా యూనియన్ అంతర్గత విషయాలను కూడా ప్రస్తావిస్తూ యూనియన్కు నష్టం చేయడంతో పాటు యూనియన్ నేతల ప్రతిష్టను దిగజార్చేవిధంగా వ్యవహరిస్తున్నారని వ్యక్తులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పర్యాదును స్వీకరించిన ఏసిపి రమణమూర్తి తగు చర్యలు తీసుకుంటామని ఐజెయు నేతలకు హామీ నిచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావుఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు ఎ ఖదీర్, నగర అధ్యక్ష, కార్యదర్యులు వైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శివానంద, ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుపోత్తం, నాయకులు  జనార్ధనాచారి, వేణుగోపాల్, సాగర్, నాగేందర్రెడ్డి, కళ్యాణ్, కె. వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now