*సీఎం జన్మదిన వేడుకల్లో మున్సిపాలిటీ నిధుల దుర్వినియోగం’: కలెక్టర్ కు ఫిర్యాదు*
*కామారెడ్డి మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నిధులు దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ కౌన్సిలర్ నిట్టు కృష్ణ మోహన్ రావు, ముప్పారపు అపర్ణ, ముదాం ప్రముఖలు ఆరోపించారు. ఈ విషయమై శనివారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సభ్యులకు సమాచారం లేకుండా వేడుకలు నిర్వహించడంతో పాటు ఎజెండాలో ఖర్చు ఓ చోట రూ.60 వేలు అని, మరొక అంశంలో రూ.లక్షా 30 వేలుగా చూయించారన్నారు. అలాగే 800 మందికి భోజన ఏర్పాట్లు చేసినట్టు చూయించారని, మున్సిపల్ యాక్ట్ ప్రకారం భోజనం ఖర్చుకు నిధులు ఇవ్వడానికి వీల్లేదని, ఎజెండా నుంచి ఈ అంశాన్ని రద్దు చేయాలని కోరారు. కమిషనర్ సంతకం లేకుండానే ఎజెండా పొందుపరిచారని కలెక్టర్ కు వివరించారు.*