అడిగిన సమాచారం ఇవ్వకుండా డబ్బులు అడుగుతున్నారని దుష్ప్రచారం చేసిన ప్రభుత్వ ఆసపత్రి సూపరిండెంట్ పై కలెక్టర్కు ఫిర్యాదు

అడిగిన సమాచారం ఇవ్వకుండా డబ్బులు అడుగుతున్నారని దుష్ప్రచారం చేసిన ప్రభుత్వ ఆసపత్రి సూపరిండెంట్ పై కలెక్టర్కు ఫిర్యాదు

– పదిమందిలో పరువు పోయిందని ఆవేదన

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి జిల్లా ఆస్పత్రి మాజీ సూపర్డెంట్ డాక్టర్ విజయలక్ష్మి తాము అడిగిన సమాచారం ఇవ్వకుండా తామే డబ్బులు అడుగుతున్నట్లు ప్రచారం చేయడంతో మనోవేదనకు గురి అయిన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన స్వప్న ప్రభాకర్ దంపతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి పిలిపించి వారికి వారు అడిగిన సమాచారం ఇవ్వాలని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమల ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే తాము ఆ డాక్టర్ల వివరాలను కోరామని, డాక్టర్లు విధులు నిర్వహించే సమయంలో పేషెంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రవేట్ ఆసుపత్రిలో ఒక తీరు, ప్రభుత్వ ఆసుపత్రిలో మరొక తీరు పని చేయకుండా ఎక్కడ చేసినా పేషెంట్లను పేషెంట్లుగానే చూడాలని ప్రభుత్వ డాక్టర్లను కోరుతున్నామన్నారు.

Join WhatsApp

Join Now