ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి – కలెక్టర్ ఆదేశం

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి – కలెక్టర్ ఆదేశం

ప్రజావాణిలో 46 అర్జీలు స్వీకరణ

కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):

జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్‌తో కలిసి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 46 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ వీణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment