పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలి

బీసీ కుల గణన చేయాలి మరియు పూర్తిస్థాయి రైతు రుణమాఫీ చేయాలి.

 

ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ళ రవిబాబు

 

సిద్దిపేట సెప్టెంబరు 30 ప్రశ్న ఆయుధం :

 

రాష్ట్రంలో అగ్రకుల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే బీసీ కుల గణన చేయకుండా తాత్సారం చేస్తుందని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ కుల గణన కొరకు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలి కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పలు అంశాలపై ప్రజావాణి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన అందించడం జరిగింది. అందులో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ళ రవిబాబు మాట్లాడుతూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమం నేటికీ పూర్తిగా అమలు చేయలేదని జిల్లాలో మరియు రాష్ట స్థాయిలో ఇంకా ఋణ మాఫీ కానీ రైతు లబ్ధిదారులను గుర్తించి వెంటనే పూర్తిస్థాయిలో రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేయాలని. జిల్లాస్థాయిలో అన్ని గ్రామాలలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్న కోనో కార్పస్ చెట్ల వలన ప్రజలకు శ్వాస సంబంధమైన మరియు ఇతర జీవవైవిద్యమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న శాస్త్రీయ నిరూపణను పరిగణలోకి తీసుకొని కోన కార్పస్ చెట్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో ఇతర అవెన్యూ మొక్కలను నాటాలి దీని కొరకు ఇదివరకే పలుమార్లు గౌరవ జిల్లా కలెక్టర్ కి మరియు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చియున్నామని ద్దేనిపైన నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోవడం జరిగింది. ఇప్పటికైనా దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని

అదేవిదంగా జిల్లా స్థాయిలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి వెంటనే రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకి పంపిణీకి కానీ రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేసి దీనితోపాటు ఇందిరమ్మ ఇండ్లు అను పథకం కింద ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండు చేశారు. లేనిచో భవిష్యత్తులో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, జిల్లా నాయకులు బాబురావు ,సుమన్, సురేష్ తదతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now