Headlines :
-
“తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే: అవగాహన కార్యక్రమం”
-
“సర్వేలో తప్పిదాలు నివారించడానికి అధికారుల సూచనలు”
-
“సామాజిక, ఆర్థిక, విద్య సర్వే: ప్రభుత్వ యోచనలు”
*జమ్మికుంట అక్టోబర్30 ప్రశ్న ఆయుధం:-*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర కుటుంబ సర్వేపై మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం మండలంలోని మండల అభివృద్ధి కార్యాలయ అధికారులు, పంచాయతి కార్యదర్శులు, అర్పిలు, అంగన్వాడి టీచర్లు, మున్సిపల్ అధికారులు పలువురికి సమగ్ర కుటుంబ సర్వేపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఈడి, ఎస్సీకార్పొరేషన్, తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ లు మాట్లాడుతూ సర్వే చేసేటప్పుడు ఎటువంటి దుష్ప్రచారాలు ప్రబలకుండా చూసుకోవాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో, మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఫామ్స్ అధికారులకు అందజేస్తారని తెలిపారు. షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి ఫోర్స్ లేకుండా, తప్పిదాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్స్ అబ్దుల్ భారీ, పి ఆర్ శ్రీనివాస్, ఏ కరుణాకర్ రెడ్డి, మునిసిపల్ ఏఈ నరేష్, శ్రీధర్ టీపీఓ, మేనేజర్ జి రాజిరెడ్డి, వాణి, భాస్కర్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.