పాఠశాలలను తనిఖీ చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు..

పాఠశాలలను తనిఖీ చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్ ఎన్ రామ్ చందర్..

IMG 20240827 WA0087

నిజాంసాగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో గల ప్రాథమికోన్నత పాఠశాల ఉర్దూ మీడియం. మరియు ప్రాథమిక పాఠశాల నిజాంసాగర్ క్యాంప్ పాఠశాలలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం రామచందర్ మంగళవారం నాడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రగతిని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల , విద్యార్థుల హాజరు నమోదు పరిశీలించడం జరిగింది. బేస్ లైన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను మరియు మార్కుల నమోదు ప్రక్రియను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది .విద్యార్థుల హాజరును డి ఎస్ ఇ ఎఫ్ ఆర్ యస్ ఆన్లైన్లో రోజు ఉదయం 9:30 లోపు పొందుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించి వ్యక్తిగత శుభ్రత పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది .అనంతరం పాఠశాలలోని బియ్యం నిల్వలను రిజిస్టర్ లో ఉన్న విధంగా ఉన్నావా లేవని సరి చూడడం జరిగింది. అనంతరం విద్యార్థుల యొక్క ప్రగతిని తరగతి వారీగా పరిశీలించారు .ఈ కార్యక్రమంలో సిఆర్పి బి.శ్రీధర్ కుమార్, పి.నర్సింలు ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లాయక్ ఉన్నిసా బేగం, యాస్మిన్ బేగం ప్రాథమిక పాఠశాల నిజాంసాగర్ క్యాంప్ ప్రధానోపాధ్యాయులు రాజు,బాలరాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now