సమగ్ర కుల గణనకు 6న ప్రారంభం: రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలి
బీసీ కులగణన పై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమం
–ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్ ప్రశ్న ఆయుధం నవంబర్ 02:
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులగనన ఈ నెల 6న ప్రారంభం ఏఐసీసి. మరియు.టీపీసీసీ ఆదేశాల మేరకు కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు సంబందించి అవగాహన సదస్సు కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొనగా ఇందులో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. కాసుల బాలరాజ్ .వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి. డిసిసి అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు హాజరు అయ్యారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ. గతంలో మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు బీసీ కులగణన పై ఇదే విషయాన్ని నేను లేవనెత్తాను కురుమలు గొర్రెలే కాయల కుమ్మరులు కుండలే చేయాలా మంగలి తన వృత్తి చేయాలా చాకలి బట్టలే ఉత్కాల అని నేను లేవనెత్తితే నా మాటలు స్పీకర్ ద్వార రికార్డు నుండి తొలగించారు. కాంగ్రెస్ గత ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా కామారెడ్డి లోనే బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ప్రోత్బలంతో దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగనన చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు ఇందులో భాగంగా 3 రోజులపాటు ఇళ్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపడతారు. సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 6 నుంచి జరగనున్న సమగ్ర కుల గణనలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని షబ్బీర్ అలీ కోరారు.భవిష్యత్తులో అన్ని పథకాలకు ఈసర్వే ఆధారంగానే ఉంటాయి కులగణనకు తెలంగాణ సర్కారు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాల్లో ఇప్పటికే ఇళ్ల గుర్తింపు పూర్తి చేశారు ఈనెల 6 నుంచి సర్వే ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రజలంతా విశ్వసనీయ సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందనిఅన్నారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహలను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించాలి అన్నారు.ఎన్యుమారేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సరైన వివరాలు తీసుకోవాలని కుటుంబ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కుల సర్వేను పక్కాగా నిర్వహించాలని సూచించారు.150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ సర్వే చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్ష మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దీని నివేదిక ఆధారంగానే రాబోయే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.ఇందులో అన్ని కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు గ్రామ అధ్యక్షుడు కార్యకర్తలు దీన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి పూర్తి చేయాలన్నారు.