Site icon PRASHNA AYUDHAM

సమగ్ర కుల గణనతో సామాజిక న్యాయం:* టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

కుల

Oplus_131072

Headlines (Telugu)
  1. సమగ్ర కుల గణన ద్వారా బీసీలకు అవకాశాలు పెరగాలని నిర్మలా జగ్గారెడ్డి
  2. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
  3. కుల గణనతో సంక్షేమ పథకాలు వేగవంతం అవుతాయని హామీ

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, బీసీ కుల గణనతో బీసీలకు అన్ని అంశాలలో అవకాశాలు పెరుగుతాయని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్ లో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేతో బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

సమగ్ర ఇంటింటి సర్వే తో సేకరించిన వివరాలతో ప్రజల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించవచ్చని అన్నారు. బీసీ కుల గణన తర్వాత జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరిగి రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణలోని అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుల నిర్ణయం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కుల గణన తర్వాత సంక్షేమ పథకాలు మరింత వేగవంతమై అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అభివృద్ధి అందుతుందని హామీ ఇచ్చారు. ఈ కుల గణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గడపకు చేరవేయాలని అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు, తోపాజీ అనంత కిషన్, పులిమామిడి రాజు, శ్రీనివాస్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, వివిధ మండల, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version