Headlines :
-
కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్ర కుటుంబ సర్వే పై ప్రసంగం
-
ప్రజల జీవనస్థితి కోసం సమగ్ర సర్వే కీలకం
-
శిక్షణ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి అక్టోబర్
కలెక్టర్ జతీష్ వి. పాటిల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. వచ్చే నెల 6 నుండి మొదలయ్యే సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల సాటిస్టికల్ ఆఫీసర్స్, మండల ప్రత్యేక అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లకు ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరించాలని అన్నారు ప్రజల యొక్క జీవనస్థితి మరియు ఇతర పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేపడుతుందన్నారు. దీని ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను గుర్తించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.ఈ సర్వేలో ప్రజల నుండి తీసుకోవలసిన వివరాలు, ఇతర అంశాలపై ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లకు అవగాహన ఉండాలనిఅన్నారు. సర్వేలో భాగంగా ప్రతి బ్లాక్ లోని అన్ని కుటుంబాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన ఎన్యుమరేషన్ బ్లాక్ లో ప్రతి కుటుంబాన్ని క్రమ పద్ధతిలో జాబితా తయారు చేయాలన్నారు. ప్రతి ఇంట్లో నివసించే వారి సంఖ్య, ఇంటి నెంబరు, ఇంటి యజమాని, పేరు, రేషన్ కార్డ్ , ఆధార్ కార్డ్ తదితర వివరాలు ఫారంలో నమోదు చేయాలన్నారు. ఇంటి సర్వే పూర్తి అయిన వెంటనే వివరాలు నింపిన స్టిక్కర్ని ఇంటి గోడపై అతికించాలన్నారు. ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబ యజమాని వద్ద నుండి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని వారికి తెలియజేయాలి అని అన్నారు. ఎన్యుమరేషన్ అయిన తర్వాత నింపిన షెడ్యూల్ ఫారం ను జాగ్రత్తగా భద్రపరచాలని, ఎన్యుమరేటర్ తనకు నిర్దేశించిన డేటా ఎంట్రీ కేంద్రానికి వెళ్లి ఆపరేటర్ తో డేటా ఎంట్రీని ని పూర్తి చేయించాలని అన్నారు. డేటా ఎంట్రీ సమయంలో ఎటువంటి పొరపాట్లు తావు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఎంటర్ చేసిన డేటాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో పంచుకోకూడదని సిబ్బంది కి ఆదేశించారు. సర్వే సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో చంద్రశేఖర్ మరియు సిపిఓ సంజీవరావు పాల్గొన్నారు.