ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
ప్రశ్న ఆయుధం,కామారెడ్డి
సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సీఎం తాను హామీని నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం టీఎన్జీవో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సమ్మె శిబిరానికి వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడఎన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తపస్సు ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి సంతోష్ మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చక్రధర్, శ్రీకాంత్ ,దత్తాత్రి, లక్ష్మణ్, శ్రావణ్ , సృజన్ ,అబ్దుల్ కతర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి,నాయకులు శ్రీధర్, రాములు,కాళిదాసు, శైలజ,సంతోష్ రెడ్డి, వనజ,మంగా, శ్రీవాణి, కళ్యాణ్,సంధ్య,లింగం, కృష్ణ,దినేష్,వీణ, లావణ్య 500 మంది సభ్యులు తదితరులు పాల్గొన్నారు.