సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: పీఆర్ టీయు అధికారిక ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీఆర్ టీయు అధికారిక ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా నిరవేదిక సమ్మె శిబిరంలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావంగా శనివారం పీఆర్ టీయు కరీంనగర్ శాసన మండలి అధికారిగా అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క పనికి తగ్గ వేతనాన్ని ప్రభుత్వం అందించాలని అందుకు రాష్ట్ర శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని వెలువరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేజీబీవీలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు మరియు పండగపూట సెలవులు లేకుండా పని చేయడం లాంటి విధులను కేటాయించకుండా అట్టి విధులను నిర్వహించడానికి వార్డెన్ వంటి పోస్టులను ఏర్పాటు చేసి కేజీబీవీలలో నాణ్యమైన విద్యాభ్యాసానికి తగ్గ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. సీఆర్పీలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు వారి పనికి తగ్గ వేతనం అందించాలని వారికి ప్రయాణ భత్యము ఎప్పటికప్పుడు చెల్లిస్తూ పెరిగిన ఇంధన చార్జీలకు అనుగుణంగా ప్రయాణ చార్జీలను కూడా పెంచాలని తెలిపారు. మొత్తం మీద సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ పనికి తగ్గ వేతనం వచ్చే విధంగా ఎంటి ఎస్ సాధనకు పిఆర్టియు కట్టుబడి ఉందని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం నాకు తన మద్దతు 100శాతం ఉంటుందని పిఆర్టియు సంఘం యొక్క మద్దతు బాధిత ఉద్యోగుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగ మహేందర్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు కుషాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now