సంగారెడ్డి/నారాయణఖేడ్, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిర్గాపూర్ లోని శివాజీ చౌక్ వద్ద బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, విపక్షాలపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రజల గళాన్ని అణచివేయాలనే ప్రయత్నం చేస్తున్న రేవంత్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ పార్టీ శక్తివంచన లేకుండా పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అరుణ్‌రాజ్ శేరికార్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పటేల్, యూత్ అధ్యక్షుడు యాదగిరి, ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు గైని రాజు, యువజన ప్రధాన కార్యదర్శి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.