అక్రమ కట్టడాలతో కాలనీవాసుల ఆందోళన

*అక్రమ కట్టడాలతో*

*కాలనీవాసుల ఆందోళన.*

 చేగుంట మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ జి ఓ కాలనీకి తోడు సౌకర్యం ఉండేది. రోడ్డును కబ్జా చేశారు. కాలనీవాసులకు వెళ్లడానికి రోడ్డు లేక తమ వాహనాలకు రాక పోకలకు ఇబ్బంది ఏర్పడిందని కాలనీ వాసులు తెలిపారు . కాదని వాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, చేగుంట లో ఎన్ జి ఓ కాలనీ కి వెల్లే రోడ్డును దౌర్జన్యంగా ఒక వ్యాపారవేత్త లోకల్ లీడర్ల అండదండతో ఆక్రమించి మురికి కాలువపై ఇటీవల అక్రమ నిర్మాణం చేపట్టారు. ఇట్టి విషయం పై కాలనీ వాసులందరూ చేగుంట మేజర్ గ్రామపంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లి కాలనీవాసులు రాత పూర్వకంగా రాసి ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రోడ్డు మార్గం చూపించాలని పంచాయతీ ఈవో ను కాలనీవాసులు కోరారు. అక్రమార్కులు రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.

పంచాయతీ సెక్రటరీ నరేష్ ఈవో వివరణ కోరగా ,గత పంచాయతీ ఈవోగా పనిచేసిన అధికారి అట్టి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను దీని పైన ఎన్ జి ఓ కాలనీ వాసులు పిర్యాదు మేరకు, సమగ్ర విచారణ జరిపి సంబంధిత మండల అధికారులతో మాట్లాడి ఆక్రమించిన వారిపై తగుచర్యలు తీసుకుంటానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment