భూమి కబ్జా చేశారంటూ ఆందోళన
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
తాతల కాలం నాటి పట్టా
భూమిని కాజేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు తహసీల్దార్ కార్యా లయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మహ్మద్ సంథాని, హైమాద్, రిజ్వన్, ఇబ్రహీం, యాసిన్, బురాన్, అయూబ్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని బిజ్జిపూర్ గ్రామంలో సర్వేనంబర్ 88బై2 లో 1-14 గుంటల భూమి మహ్మద్ హుసేన్ పేరిట ఉన్న పట్టా భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపా రులు నకిలీ వ్యక్తుల పేరుతో పట్టా మార్పు చేసి నట్లు ఆరోపించారు. అసలైన పట్టాదారుడు మహ్మద్ హుసేన్, అతని కొడుకులు మృతి చెం దారని వారి వంశస్తుల పేరిట పట్టా మార్పిడి జరగాల్సి ఉండగా, హుసేన్ తో ఎలాంటి సంబం ధం లేని అఫ్టల్ పేరిట రికార్డు మారిందని వాపో యారు. వారం రోజుల వ్యవధిలో అప్టల్ నుంచి సద్ది మాధవరెడ్డి పేరిట భూమి రిజిస్ట్రేషన్ జరిగిన పత్రాలు చూయించారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు వెళ్లామని ఈ నెల 17న గ్రామానికి రాగా.. తమ భూమిలో ఆక్రమంగా గోడ నిర్మాణం చేపట్టిన విషయం గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం తహసీ ల్దార్ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు. రికార్డులు, గ్రామంలో భూముల వివరాలు పరిశీలించి న్యాయం చేస్తానని తహసీల్దార్ బాధితులకు హామీ ఇచ్చారు.