Headlines :
-
అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
-
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్
-
ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన మాజీ సర్పంచ్‌లను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ముఖ్యమంత్రి ని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నది.ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా?బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటి?అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.