సిపిఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిపట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాలుసంతాపాన్ని ప్రకటించారు. విద్యావేత్తగా ఉన్న ఏచూరి సిపిఎం పార్టీలో చేరి క్రియాశీలంగా నిలిచారని, అనేక ప్రజా, కార్మికోద్యమాలను నాయకత్వం వహించారని, దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. సిపిఎం, అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగాడని అన్నారు. బలమైన రాజకీయ నాయకున్ని దేశం కోల్పోయిందని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
Latest News
