Site icon PRASHNA AYUDHAM

18 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహణ..

IMG 20241114 WA0034

18 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహణ..

పిల్లలను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ… ఇప్పుడు కూడా ఎన్నో పథకాలను అమలుచేస్తోంది. పాఠశాల ఆరోగ్యం’ కార్యక్రమం కింద 18 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా, రేపటి సమాజం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో… గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ళ లోపు పిల్లలకు 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలసంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహారాన్ని ‘టేక్ హోమ్ రేషన్’ గా అందిస్తోంది. పేదరికం కారణంగా బాలబాలికల్లో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ‘తల్లికి వందనం’ పథకానికి ఈ బడ్జెట్లో రూ.6487 కోట్లు కేటాయించింది. అంతేకాదు పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యకు ఎన్నడూ లేనంతగా రూ.29,909 కోట్లు కేటాయించడం జరిగింది.

Exit mobile version