స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా నిర్వహించండి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు
జిల్లాల వారీగా పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 1
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ప్రక్రియను సమర్థవంతంగా, సమయానికి పూర్తి చేయాలని అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), ఎన్నికల రిజిస్టరింగ్ అధికారులు (EROs) పాల్గొన్నారు.
గత సమావేశం తర్వాత ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు. కామారెడ్డి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మ్యాపింగ్ కార్యక్రమం, బి.ఎల్.ఓలు, సూపర్వైజర్ల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాల వారీగా పనులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రతి క్యాటగిరీ వారీగా రివిజన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు.