Site icon PRASHNA AYUDHAM

కండక్టర్ వి.శ్రీనివాస్ ను సన్మానించిన ఈడీ పురుషోత్తం నాయక్

IMG 20240730 120111

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్ వి.శ్రీనివాస్ ను ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం నాయక్ సన్మానించారు. మంగళవారం సంగారెడ్డి డిపోలో టీజీ ఆర్టీసీ త్రైమాసిక ప్రగతి చక్ర అవార్డులో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన కండక్టర్ వి.శ్రీనివాస్ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. రీజనల్ పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్ శ్రీనివాస్ కు హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ పురస్కారాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అదేవిధంగా పలువురు శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కండక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఉత్తమ పురస్కారం తీసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా అహర్నిశలు పని చేస్తానని పేర్కొన్నారు. అదే విధంగా గజ్వేల్ డీఎం పవన్ కండక్టర్ శ్రీనివాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎం ఉపేందర్, గజ్వేల్ డీఎం పవన్, మెదక్ డీఎం సురేఖ, ఆర్ఎం ప్రభులత, డిప్యూటీ ఆర్ఎం దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version