బంగారు పతకం సాధించిన దీప్తికి శుభాకాంక్షలు

IMG 20240828 WA29341

 

తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముత్తినేని వీరయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఆసియా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించి 2024 పారిస్ లో జరుగు పారా ఒలంపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడానికి వెళుతున్న వెళుతున్న తెలంగాణ ముద్దు బిడ్డ జీవాంజి ధీప్తికి తెలంగాణ వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్, తెలంగాణ పారా స్పోర్ట్స్ గౌరవాధ్యక్షులు ముత్తినేని వీరయ్య శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నుండీ ప్రారంభమై ఈ రోజు ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించడానికి వెళ్ళడం పట్ల మాకు, మా అసోసియేషన్ కి, మా సమస్త పారా క్రీడాకారులకు, వికలాంగుల జాతికి చాలా గర్వంగా ఉందని అన్నారు. జీవన్ జీ దీప్తికి ఆత్మవిశ్వాసంగా ముందుకు వెళ్ళాలని పట్టుదలతో పరుగు పందెంలో పాల్గొని బంగారు పథకాన్ని సాధించి తన ప్రతిష్ఠతో పాటు దేశ గౌరవాన్ని, రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా కృషి చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రములో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని దీనిలో భాగంగా పారా క్రీడలకు కూడా హర్యానా ప్రభుత్వములో ప్రోత్సాహం మాదిరిగా తెలంగాణ రాష్ట్రములో కూడా పారా క్రీడాకారులకు అందేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డీ సహకారంతో అన్నీ సదుపాయాలు కల్పించి అండగా ఉంటామన్నారు

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సింగారపుబాబు, గౌరవ సలహాదారు సంజీవయ్య, జనరల్ సెక్రటరీ గాడిపల్లి ప్రశాంత్, టెక్నికల్ కమిటీ మెంబర్ నరేష్ యాదవ్, ట్రె జరరీ నూక రాజు, సైదులు, శ్రీనివాస్ రెడ్డీ, సురేష్ తదితరులు పాల్గోన్నారు

Join WhatsApp

Join Now