సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రీన్ ఛాంపియన్ పురస్కారం 2025ను అందుకున్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులడు రామకృష్ణను మరియు జిల్లా, మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నిజాంపూర్ (కె ) పాఠశాలలో 2024- 2025 విద్యా సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలను సంబంధించిన పాఠశాల కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సెక్టోరియల్ అధికారి వెంకటేశం, అకాడమిక్ మానటరింగ్ ఆఫీసర్ బాలయ్య, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి మండల విద్యాధికారి శంకర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న రామకృష్ణకు అభినందనలు తెలిపిన కలెక్టర్

Oplus_0