ఘనంగా శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి
ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 21, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం, జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి చర్చి కొండ లక్ష్మణ్ బాపూజీ కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పద్మశాలి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు నేత మాట్లాడుతూ.. పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ శిఖరమని క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కీ ఆందోళన, తొలిదశ , మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన స్వతంత్ర సమరయోధులు, మాజీ అడ్వకేట్ గా, మంత్రివర్యులు, మంత్రి పదవులు సైతం చిటికలో వదిలేసిన కొన ఊపిరి వరకు తెలంగాణ కొరకై తన జీవితాన్ని లెక్కచేయక త్యాగం చేసిన స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయన జీవితం తెరచిన ఒక పుస్తకమని, ఆ పుస్తకములో మనకు తెలువని తెలంగాణ విషయాలు ఎన్నో మరెన్నో అని, బీసీల కొరకై ప్రభుత్వ హాస్టల్లో ఫీజులు లేకుండా స్కాలర్ షిప్ లు విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాలలో ప్రభుత్వం ఇవ్వాలని కోరిన మహోన్నతమైన వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు నేత, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనరసింహులు, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, 38వ వార్డ్ కౌన్సిలర్ విగ్రహ దాత బత్తిని నాగభూషణం అడ్వకేట్ ,17వ వార్డు కౌన్సిలర్ అవధూత నరేందర్ , మాజీ అధ్యక్షులు షేర్రుల రాములు, బహుజన ఐక్య వేదిక కార్యదర్శి క్యాతం సిద్ధ రాములు అడ్వకేట్, బిసి సంఘం జిల్లా అధ్యక్షురాలు భోగ లత , జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రాజయ్య, అల్వాల గోపాల్, ఎన్ నారాయణరావు , ఎం వెంకటి, సహాయ కార్యదర్శి పి ప్రవీణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు జుర్రిగల నరసయ్య , పద్మశాలి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజయ్య, క్యాషియర్ సబ్బుని ధర్మపుర, జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని కృష్ణ హరి, కే నర్సింలు, కె దామోదర్, బి భూమేష్ తదితర పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.