గుండ్ల చెరువును అభివృద్ధి చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు

*గుండ్ల చెరువును అభివృద్ధి చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు*

*బిజెపి నాయకులు జీడిమల్లేష్ ఆకుల రాజేందర్*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం::-*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట-జగ్గయ్యపల్లె శివారులోని గుండ్ల చెరువు గత ఆరు నెలలుగా మత్తడి గండి పడి రైతులకు ఆబాది జమ్మికుంట- జగ్గయ్యపల్లె గ్రామప్రజలకి రాకపోకలు ఇబ్బంది ఏర్పడిన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పట్టించుకోవడం లేదని బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడిమల్లేష్ బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ అన్నారు. చెరువు దగ్గర కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు గొడవ పడడం చాలా సిగ్గుచేటని రైతుల పంట ఇంటికి వచ్చే సమయంలో కూడా మత్తడి గండిని పూడ్చి (మరమ్మతులు) చేయకపోవడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు పండించిన పంటను వల్భాపూర్ జగ్గయ్య పల్లెల మీదుగా జమ్మికుంట మార్కెట్కు వస్తే టాక్టర్ కిరాయిలు ఎక్కువ అవుతుందని రైతులు మున్సిపల్ చైర్మన్ నుకు గానీ, కాంగ్రెస్ నాయకులకు గానీ మొరపెట్టుకున్నప్పుడు కూడా చిన్న గండిని పూడ్చలేని దద్దమ్మలు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులని బిజెపి నాయకులు బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడిమల్లేష్, ఓబీసీ మోర్చాజిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జీడి మల్లేష్, ఆకుల రాజేందర్, ఠాగూర్ రాజేష్, కొమ్ము అశోక్, కైలాస కోటి గణేష్ , బచ్చు శివన్న, ఇటికాల స్వరూప, తూడి రవిచంద్ర రెడ్డి, బూరుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్ రామస్వామి, పోడేటి అనిల్, దార కృష్ణ, ఎర్ర వెంకటేష్, ముద్దం మధు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment