Site icon PRASHNA AYUDHAM

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్…

IMG 20240723 WA1088

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

హనుమకొండ జిల్లా ప్రశ్న ఆయుధం

గత ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే బీసీలకు 23 శాతం నుండి 42 శాతానికి రిజర్వేషన్ కల్పిస్తామని హామీల వర్షం కురిపించి అందలమెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయడం లేదని పరకాల నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ ప్రశ్నించారు. మంగళవారం ఆత్మకూర్ మండల కేంద్రంలో నీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బిజెపి కార్యకర్తల సమావేశంలో డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్న కూడా ఎందుకు జనాభా లెక్కలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను బీసీలు నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి రాగానే 100 రోజులు లోపే జనాభా లెక్కలు చేయిస్తామన్న హామీ ఏమైంది అన్నారు. బీసీలకు బీసీ కార్పొరేషన్ లో చిల్లిగవ్వలేదు, సంక్షేమ పథకాలు లేవు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక అవస్థలు పడుతున్నారన్నారు. బీసీ కులస్తులకు, బీసీ కుల వృత్తిదారులకు స్వయం ఉపాధి కల్పించడంలో, కుల వృత్తులను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రతి సంవత్సరం 20 వేల కోట్లతో బీసీలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. బీసి కుల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ఏర్పాటు చేయాలన్నారు.స్థానిక సంస్థ ఎన్నికల ముందే జనాభా లెక్కలను చేయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. లేనిపక్షంలో అదే బీసీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారన్నారు. గత ప్రభుత్వంలో ముదిరాజు కులస్తులకు చేప పిల్లలు ఇవ్వకుండానే 100 వరకు అవినీతికి పాల్పడినట్లు డాక్టర్ కాళీ ప్రసాద్ విమర్శించారు.అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు బలవంతుల రాజు, మాజీ అధ్యక్షులు ఈరసట్ల సదానందం, ప్రధాన కార్యదర్శి ఉప్పుగల్లు శ్రీకాంత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు గట్టు వేణు గౌడ్,కిసాన్ మోర్చా పరకాల నియోజకవర్గం కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, జిల్లా ఆర్టిఐ కన్వీనర్ ఎథిలాపురం శ్రవణ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు పూజారి రవీందర్, మండల కార్యదర్శులు బయ్య పైడి కళ్యాణ్, రవ్వ శివప్రసాద్, బీజేవైఎం మండల అధ్యక్షులు పోరెడ్డి ప్రదీప్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు వేములపల్లి శ్రీలత, తదితరులుపాల్గొన్నారు

Exit mobile version