*ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు*
*హుజురాబాద్ జూన్ 10 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అరవింద్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పునాది వేయడం జరిగిందని ప్రతి మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయడంలో కృషి చెందాడని కవ్వంపల్లి సత్యనారాయణ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో రానున్న రోజుల్లో మరిన్ని నూతన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని యూత్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు చల్లూరి విష్ణువర్ధన్ మేకల రాజ్ కుమార్ సందీప్ అరుణ్ మండలం ప్రధాన కార్యదర్శ పంజాల రాజు అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ రేవంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంపత్ రామ్మోహన్ సాయి బన్నీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు