హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్

*హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ*

*రైతు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి*

*తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చెల్పూరి రాములు*

*ఇల్లందకుంట జనవరి 5 ప్రశ్న ఆయుధం:*

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి గోరంగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు చెల్పూరి రాములు తీవ్రంగా దుయ్యబట్టారు ఎన్నికల ముందు రైతు భరోసా పసలుకు 7500 ఇస్తానని తీరా అధికారంలోకి వచ్చాక నేడు 6000 ఇస్తానన్నడం సిగ్గుచేటు ఆదివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం యాసంగి పంటలకు ఎకరాకు పంటకు 7500 ఇస్తానన్న వాగ్దానాన్ని పక్కనపెట్టి 6000 రూపాయలు ఇస్తాను అనడం సిగ్గుచేటుఅని రైతులు మళ్లీ అప్లై చేసుకోవాలనడం సరైనది కాదని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణిని ‘భూభారతి`2024’ గా పేరు మార్పు చేసిందని గవర్నర్‌ ఆమోదించిన తరువాత గెజెట్‌ ప్రకటించాల్సివుందని ఆతరువాత చట్టానికి రూల్స్‌ రూపొందించాలని సాగుదారుల హక్కులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినప్పటికీ భూభారతి చట్టంలోని 23 సెక్షన్‌లలో ఎక్కడా పేర్కొనలేదని రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు, మరో 6 లక్షల మంది సాగుదారులు పట్టాదారులు లేకుండా సాగుచేస్తున్నారు. వీరికి సాగు హక్కు కల్పిస్తే ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, పంటల బీమా వర్తిస్తాయి భూయజమానులతోపాటు, సాగుదారులకు హక్కులు కల్పించాలని తహశీల్దార్‌, ఆర్‌డిఓ, కలెక్టర్‌, సిసిఎల్‌ఎ కార్యాలయాల వద్ద గతంలో జరిగిన లోపాలను సరిచేసే విధంగా చూడాలని ట్రిబ్యూనల్‌ ఏర్పాటు, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారుల నియామకానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సాగుభూములను, సాగేతరభూములను విడివిడిగా రిజిష్టరు తయారు చేయాలని సాదాబైనామాలను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 9.12.2023 వరకు వచ్చిన ధరఖాస్తులను ఆమోదించాలి. అసైన్డ్‌ భూముల సమస్యలను రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వ భూములు(బంచరాయి, పోడు) సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరి రూ.500, మొక్కజొన్న రూ.330, కందులు రూ.400, సోయబీన్‌ రూ.350, పత్తి రూ.475, జొన్నలు రూ.292 పంటలకు బోనస్‌ ఇవ్వాలని అలాగే పసుపు రూ.12,000, మిరప రూ.15,000, చెరుకు రూ.4,000, ఎర్రజొన్న రూ.3500 పంటలకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలు అమలు చేయాలని అన్ని పంటలను సివిల్‌ సప్లయిస్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్రస్తుతం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని తొలగించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణ మాఫీలో ఇప్పటికి 60 శాతం మాత్రమే విడుదల చేశారు. ఇంకా దాదాసు 18 లక్షల మంది రుణమాఫీ కొరకు ఎదురు చూస్తున్నారని 2024-25కు వానాకాలం, యాసింగికి కలిపి రూ.81,477 కోట్లులో రూ.44వేల కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారని అన్నారు యాసింగి పంటలకు రుణాలివ్వాలని యాసింగి రైతు భరోసాను సంక్రాంతికి ఇస్తామని చెబుతున్నారని క్యాబినెట్‌ కమిటీ జనవరి 5,6,7 తేదీల మద్య ధరఖాస్తు చేసుకున్న వాస్తవ సాగు రైతులకే రైతుభరోసా వర్తింప చేస్తామని నిర్ణయించారు. ఇప్పటికే వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్ణయం తెలియని రైతులు ధరఖాస్తు చేసుకోవడంలో వైఫల్యం చెందితే వారికి రైతుభరోసా అందదు. అందువల్ల గ్రామ సభలు జరిపి వాస్తవ సాగుదారులను నమోదు చేసి వాస్తవ సాగుదారులందరికి రైతు భరోసా వర్తింప చేయాలని రైతుబందు వచ్చిన తరువాత విత్తన, ఎరువుల సబ్సిడి రద్దు చేశారని చివరికి రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటి రుణాలు ఇవ్వడం తగ్గించిందని రైతుభరోసా రాకపోవడం వలన అధిక వడ్డీకి ప్రైవేట్‌ రుణాలు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారని ఫసల్‌ బీమాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకానికి ప్రణాళిక రూపొంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రాములు అన్నారు.

Join WhatsApp

Join Now