రైతన్నలకు పెద్ద పిట వేసిన కాంగ్రెస్

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్

మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్

ప్రశ్న ఆయుధం జులై 26
కామారెడ్డి/బీబీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 అర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ 72.659 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం హర్షణియమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తూన్న ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నూటికి నూరు శాతం రైతు పక్షపాత బడ్జెట్ అని అన్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధిక బడ్జెట్ అని గడచిన పదేళ్లలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు వ్యవసాయ రంగంలో ప్రాధాన్య పథకాలు రైతు రుణమాఫీ,రైతు బీమా ,రైతు భరోసా ,పంటల బీమా , పంటలకు బోనస్,భూమిలేని రైతు కూలీలకు ఆర్థిక సాయం వంటి పథకాల అమలుకు పూర్తి స్తాయిలో బడ్జెట్ లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నిరూపించిందని వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు

Join WhatsApp

Join Now