పేదలకు ఇచ్చిన హామీలను మరిచి న కాంగ్రెస్ సర్కార్…. అలవాల రాజా పెరియార్
స్థానిక జగదీష్ కాలనీ నందు ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంఎస్పి ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్ మాట్లాడుతూ ….కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను ప్రకటనలకే పరిమితం చేస్తూ పేదల జీవితాలతో ఆటలాడుకుంటుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల మీద ఆధారపడి జీవిస్తున్న వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, పెంచుతానన్న పెన్షన్లు పెంచకుండా ఉన్నవాటిని సక్రమంగా ఇవ్వకుండా పెన్షన్ బాధితులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు అన్ని రకాల సౌకర్యాలు అందుతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగిలిందని, చదువుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, గ్యాస్ సబ్సిడీ పడకపోవడం, ఉచిత కరెంటు అందరికీ అందకపోవడం, గతంలో కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయకపోవడం, ఇలా అనేక రకాలు ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందని ఆవేదన వ్యక్తం పరిచారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై ప్రేమ ఉంటే ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదలందరిని ఐక్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇచ్చిన హామీల అమలకై ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల తిరుపతి మాదిగ, మండల సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ, మేడ్చల్ లక్ష్మణ మాదిగ, రత్న మాదిగ,మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి మాదిగ, మరియు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు