విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం

*నిరుపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం*

*జమ్మికుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జమ్మికుంట మండల కేంద్రంలో ఉన్న గురుకుల రెసిడెన్షియలు, మైనార్టీ స్కూల్ లను బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో శనివారం సందర్శించారు అనంతరం బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ అప్పని వీరు మాట్లాడుతూ
పది నెలల కాంగ్రెస్ పరిపాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు మైనార్టీ పాఠశాలలో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకొని నిర్ణయాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ మండలానికి ఒక గురుకుల పాఠశాలను నిర్మించి ఒక్కొక్క విద్యార్థికి రూ లక్ష 25 వేల నుండి రూ1,50 వేల వరకు సంవత్సరానికి వారి చదువుల రీత్యా ఖర్చు చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల ఎదుగుదలకు కృషి చేస్తే 10 సంవత్సరాల అభివృద్ధిని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలోనే దాదాపు 36 మంది విద్యార్థుల చావులకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. మెస్ చార్జీలు పెంచామని పాలాభిషేకాలు చేపించుకునే వరకే పరిమితమయ్యారు తప్ప పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా నాణ్యమైన పౌష్టికమైన ఆహారాన్ని అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిoదని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లారి లేస్తే ఏదో ఓ పేపర్లు రాష్ట్రంలో ఏదో ప్రాంతం నుండి విద్యార్థుల కన్నీటి ఘాతులను చూడవలసిన పరిస్థితి వెంటిలేటర్ సహాయంతో నిమ్స్ లాంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అటువంటి విద్యార్థులను చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో మైనార్టీ పాఠశాలలపై ప్రత్యేకమైన చర్యలు చేపట్టి పౌష్టికమైన ఆహారం అన్ని రకాల సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు జావాజీ అనిల్, వోల్లాల శ్రీకాంత్, చింతల కౌశిక్, గురుకుంట్ల ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now